సంక్షేమానికి పాతర
సంక్షేమానికి పాతర
Published Wed, Jul 20 2016 11:01 PM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
జన్మభూమి కమిటీలు చెప్పిందే వేదం
అర్హులకూ అందని పింఛన్లు, రేషన్ కార్డులు
ఊరూరా బాధితుల వెతలు
‘గడప గడపకూ వైఎస్సార్’లో
వైఎస్సార్ సీపీ నేతల వద్ద ఆవేదన
∙రావులపాలెం మండలం కొమరాజులంకలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కార్యక్రమం నిర్వహించారు. తనకు వితంతు పింఛను రావడం లేదని, ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా జన్మభూమి కమిటీ పక్కనబెట్టిందని, న్యాయం చేయాలంటూ అరపల్లి అనంతలక్ష్మి అనే మహిళ ఆయనకు పింఛను దరఖాస్తు ఇచ్చింది. తన భర్త చనిపోతే రేషన్‌కార్డు తొలగించారని, అంత్యోదయ కార్డు ఇవ్వలేదని గంగిశెట్టి వరలక్ష్మి వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది.
∙కాకినాడ కార్పొరేషన్ ఒకటో డివిజన్‌లోని గొల్లపేట, రమణయ్యపేట మార్కెట్లలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు నిర్వహించారు. రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని, పారిశుధ్యం సరిగా లేదని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రచారకమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం నేత లింగం రవి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పాలగొమ్మి నాగరాణి పాల్గొన్నారు.
∙పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం వక్కలంకలో కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర నాయకులు పీకే రావు పాల్గొన్నారు. గృహ రుణాలు, ఆరోగ్యశ్రీ వంటి సమస్యలను స్థానికులు వివరించారు.
∙ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తొల్లంగిలో అదనపు కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ నిర్వహించారు. తాగునీరు, డ్రెయినేజీ సమస్యలను స్థానికులు వివరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలెపు ధర్మారావు, కొప్పిశెట్టి బాలకృష్ణ పాల్గొన్నారు.
∙అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఎస్‌టీ రాజాపురంలో ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నిర్వహించారు. తమకు ఇంటి రుణం రాలేదని మట్టా సత్యవేణి వాపోయింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా అధికార ప్రతి నిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి లంక చంద్రన్న, ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మోకా సూరి బాబు, మండల కన్వీనర్ నల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
∙రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగిలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతం ఉదయభాస్కర్ నిర్వహించారు. మండల కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ,జిల్లాస్టీరింగ్ కమిటీసభ్యులు చోప్పా నూకరాజు పాల్గొన్నారు.
∙పిఠాపురం నియోజకవర్గం గోల్లప్రోలు మండలం కొడవలిలో ఈ కార్యక్రమం జరిగింది. తాగునీరు, ఇళ్ల స్థలాల సమస్యలను స్థానికులు పార్టీ కోఆర్డినేటర్ పెండెం దొరబాబుకు విన్నవించారు.
∙జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం సుబ్బాయమ్మపేటలో కోఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఈ కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లు ఇవ్వడం లేదని, ఇళ్ల రుణాలు మంజూరు కాలేదని స్థానికులు పేర్కొన్నారు.
∙ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో కోఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ నిర్వహించారు. ముంపు సమస్యపై చింతపల్లి మేరీ, తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని పైల రూపావతి వివరించారు. కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది.
∙సామర్లకోట పట్టణం 14, 15 వార్డుల్లోని బలుసులపేటలో ఈ కార్యక్రమాన్ని పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు నిర్వహించారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జిగిని వీరభద్రరావు, ఆవాల లక్ష్మీనారాయణ, కంతే వీరరాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
∙మండపేటలోని 17వ వార్డులో ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి నిర్వహించారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి, స్థలం చూపలేదని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టెంకె వెంకటరావు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రెడ్డి రాజబాబు పాల్గొన్నారు.
Advertisement