పేదలపై కరుణేదీ?
పేదలపై కరుణేదీ?
Published Wed, Oct 19 2016 11:18 PM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
అన్ని చోట్లా సమస్యలే
పట్టించుకునే నాథుడు కరువు ∙
గడపగడపకూ వైఎస్సార్‌లో సమస్యల Ðð ల్లువæ
సాక్షిప్రతినిధి, కాకినాడ : ఎప్పుడో ఆ మహానేత వైఎస్సార్ బతికున్నప్పుడు ఇచ్చిన ఇళ్ల స్థలాలు మెరక చేసే నాథుడే కరవయ్యాడు... డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని నమ్మించి దగా చేశారు... ఇప్పుడేమో రుణాలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారని గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, పేద, మధ్యతరగతి వర్గాలు ఆక్రోశిస్తున్నాయి. ఏ గడపకు వెళ్లినా పార్టీ కో–ఆర్డినేటర్లకు సమస్యల చిట్టానే ఎదురవుతోంది. ఇవే సమస్యలు కాజులూరు మండలం బందనపూడి, మొగలిపాలెం, పాతమొగలిపాలెంలలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ వద్ద మోకన శ్రీనివాసు, డ్వాక్రా మహిళ ఎం.లక్ష్మి ఏకరవుపెట్టారు.
రోడ్లు, డ్రెయిన్లు అధ్వానం
కాకినాడ రూరల్ మండలం ఎస్.అచ్యుతాపురం, మధురానగర్‌లో జరిగిన గడపగడపకూ కార్యక్రమంలో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు కాకినాడ రూరల్ కో–ఆర్డినేటర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వద్ద వాపోయారు. పక్కాడ్రెయిన్లు లేక మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి దోమలు, విషకీటకాలతో ఇబ్బందులు పడుతున్నామని చింతాడ చిట్టెమ్మ, మన్యం త్రిమూర్తమ్మ వాపోయారు. డ్రెయినేజీ వ్యవస్థ లేక చినుకుపడితే నివాసాలు ముంపుబారిన పడుతున్నాయని బాలయోగి కాల్వగట్టుకు చెందిన ములపర్తి సూర్యావతి ముమ్మిడివరం నగర పంచాయతీ 5వ వార్డులో కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ వద్ద వాపోయింది. ఎన్నికల సమయంలో గృహ రుణాలు మంజూరు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ విషయం మర్చిపోయారని జల్లూరి నాగమణి అనపర్తి మండలం ఊలపల్లిలో కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి వద్ద ఆవేదన చెందారు.
రుణాలు రద్దు చేయలేదు
డ్వాక్రా రుణాలు రద్దు చేయకుండా చంద్రబాబు తమను దారుణంగా మోసం చేశారని వాసంశెట్టి విజయలక్ష్మి కపిలేశ్వరపురం మండలం వాకతిప్పలో కో–ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. రోడ్లు అభివృద్ధికి నోచుకోవడం లేదు, అర్హులకు పెన్షన్లు ఇవ్వడం లేదు, ఇళ్ల రుణాల కోసం వెళితే పట్టించుకోవడం లేదని పి.గన్నవరం మండలం రాజులపాలెంలో మహిళలు కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు వద్ద వాపోయారు. పంచాయతీ కుళాయిల నుంచి తాగునీరు రావడంలేదని మోల్లేటి దేవి గోకవరం మండలంలో తిరుమలాయపాలెంలో కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ వద్ద వాపోయారు.
రోడ్లు, డ్రెయిన్లు లేకపోవడంతో వర్షం వస్తే ఇబ్బందులకు గురవుతున్నామని తలారి అనంతలక్ష్మి, జిక్కి మంగ సామర్లకోట మండలం చంద్రంపాలెం కొత్త కాలనీలో కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడుకు ఫిర్యాదు చేశారు. చినుకుపడితే ముంపునకు గురవుతోందని బి.సునీత కాకినాడ సిటీ 8వ డివిజన్ సాంబమూర్తినగర్‌లో కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్‌కు వివరించింది. జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో స్థానికులు పలు సమస్యలు పార్టీ కో–ఆర్డినేటర్ల దృష్టికి తీసుకువచ్చారు.
Advertisement
Advertisement