gadapagadapaku
-
ప్రజల ముంగిటకు సంక్షేమ ఫలాలు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధులను, శ్రేణులను సమాయత్తం చేసే దిశగా అగ్రనేతలు సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ సీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రాంతీయ సమన్వయకర్తలను, కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించి, కొత్త ఉత్సాహం నింపారు. ఈ క్రమంలో పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమితులైన ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోష్, పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి తూర్పు సెంటిమెంట్‌గా శుక్రవారం తొలి సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శనివారం కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఇటువంటి సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్యకర్తల నుంచి వచ్చే సూచనలు, సలహాలకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ పార్టీలో వారికి గుర్తింపు ఉంటుందనే సంకేతాలను రీజినల్ కో ఆర్డినేటర్లు పంపించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు చిన్నచిన్న లోపాలుంటే చక్కదిద్దేందుకు కూడా ముందుండాలని సూచించారు. ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారుంటే సచివాలయంలో ఆరు నెలలకోసారి పరిశీలించి తిరిగి అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 11న అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలియజేశారు. మూడేళ్లలో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ప్రజల సంక్షేమానికి రూ.లక్షా 43 వేల కోట్లు వినియోగించలేదన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సీఎం జగన్ అమలు చేశారని వివరించారు. మిధున్‌రెడ్డికి ఘన స్వాగతం వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమితులై తొలిసారి జిల్లాకు వచ్చిన లోక్‌సభలో పార్టీ ఫ్లోర్‌లీడర్ మిధున్‌రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు. మూడు జిల్లాల నుంచి తరలి వచ్చిన నేతలతో రాజమహేంద్రవరం కోలాహలంగా మారింది. మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న మిధున్‌రెడ్డికి పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్‌రామ్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు సమీపాన ఉన్న తోటలో రాజానగరం నియోజకవర్గ ముఖ్య నేతలను మిధున్‌రెడ్డికి రాజా పరిచయం చేశారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహానికి వచ్చిన మిధున్‌రెడ్డిని పుష్పగుచ్ఛాలతో స్వాగతించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పండుల రవీంద్రబాబు, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర తెలకుల, గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ భవానీప్రియ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గిరజాల బాబు, కర్రి పాపారాయుడు, గుబ్బల తులíసీకుమార్, వట్టికూటి రాజశేఖర్, వాసిరెడ్డి జమీలు, జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు అడపా వెంకటరమణ, నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్‌లీడర్ పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గడప గడపకూ ప్రచారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన విధంగా ఈ నెల 11 నుంచి గడపగడపకూ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని మిధున్‌రెడ్డి, బోస్ దిశానిర్దేశం చేశారు. మంత్రుల నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వరకూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రజల ముందుకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అన్ని అంశాలనూ ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రతి సచివాలయాన్ని సందర్శించి, ప్రజల సమస్యలను జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ సాధన, పార్టీ శ్రేణుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రక్రియను తాము చేపడతామని ప్రాంతీయ సమన్వయకర్తలు చెప్పారు. నాయకులు, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో కూడా ముందుంటామని ప్రాంతీయ సమన్వకర్తలు భరోసా ఇచ్చారు. పథకాలపై ఫోకస్ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధ్యక్షతన రాజమహేంద్రవరంలో జరిగిన అంతర్గత సమావేశంలో అధిష్టానం నిర్దేశించిన విధివిధానాలపై మిధున్‌రెడ్డి, బోస్ ప్రజాప్రతిని«ధులకు వివరించారు. ఈ వివరాలను మిధున్‌రెడ్డి, బోస్, మంత్రి వేణు మీడియాకు వివరించారు. మూడేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రభుత్వం పేదలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల కింద నేరుగా రూ.లక్షా 43 వేల కోట్లు అందజేసిన విషయాన్ని ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని ప్రాంతీయ సమన్వయకర్తలు సూచించారు. కుల, మత, ప్రాంతీయ వివక్షకు తావు లేకుండా ప్రజల ఖాతాల్లో పథకాల నిధులు జమయ్యేలా సీఎం జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరికీ వివరించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ విషయాలపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో సమన్వయకర్తలు సుదీర్ఘంగా చర్చించారు. -
పేదలపై కరుణేదీ?
అన్ని చోట్లా సమస్యలే పట్టించుకునే నాథుడు కరువు ∙ గడపగడపకూ వైఎస్సార్‌లో సమస్యల Ðð ల్లువæ సాక్షిప్రతినిధి, కాకినాడ : ఎప్పుడో ఆ మహానేత వైఎస్సార్ బతికున్నప్పుడు ఇచ్చిన ఇళ్ల స్థలాలు మెరక చేసే నాథుడే కరవయ్యాడు... డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని నమ్మించి దగా చేశారు... ఇప్పుడేమో రుణాలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారని గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, పేద, మధ్యతరగతి వర్గాలు ఆక్రోశిస్తున్నాయి. ఏ గడపకు వెళ్లినా పార్టీ కో–ఆర్డినేటర్లకు సమస్యల చిట్టానే ఎదురవుతోంది. ఇవే సమస్యలు కాజులూరు మండలం బందనపూడి, మొగలిపాలెం, పాతమొగలిపాలెంలలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ వద్ద మోకన శ్రీనివాసు, డ్వాక్రా మహిళ ఎం.లక్ష్మి ఏకరవుపెట్టారు. రోడ్లు, డ్రెయిన్లు అధ్వానం కాకినాడ రూరల్ మండలం ఎస్.అచ్యుతాపురం, మధురానగర్‌లో జరిగిన గడపగడపకూ కార్యక్రమంలో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు కాకినాడ రూరల్ కో–ఆర్డినేటర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వద్ద వాపోయారు. పక్కాడ్రెయిన్లు లేక మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి దోమలు, విషకీటకాలతో ఇబ్బందులు పడుతున్నామని చింతాడ చిట్టెమ్మ, మన్యం త్రిమూర్తమ్మ వాపోయారు. డ్రెయినేజీ వ్యవస్థ లేక చినుకుపడితే నివాసాలు ముంపుబారిన పడుతున్నాయని బాలయోగి కాల్వగట్టుకు చెందిన ములపర్తి సూర్యావతి ముమ్మిడివరం నగర పంచాయతీ 5వ వార్డులో కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ వద్ద వాపోయింది. ఎన్నికల సమయంలో గృహ రుణాలు మంజూరు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ విషయం మర్చిపోయారని జల్లూరి నాగమణి అనపర్తి మండలం ఊలపల్లిలో కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి వద్ద ఆవేదన చెందారు. రుణాలు రద్దు చేయలేదు డ్వాక్రా రుణాలు రద్దు చేయకుండా చంద్రబాబు తమను దారుణంగా మోసం చేశారని వాసంశెట్టి విజయలక్ష్మి కపిలేశ్వరపురం మండలం వాకతిప్పలో కో–ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. రోడ్లు అభివృద్ధికి నోచుకోవడం లేదు, అర్హులకు పెన్షన్లు ఇవ్వడం లేదు, ఇళ్ల రుణాల కోసం వెళితే పట్టించుకోవడం లేదని పి.గన్నవరం మండలం రాజులపాలెంలో మహిళలు కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు వద్ద వాపోయారు. పంచాయతీ కుళాయిల నుంచి తాగునీరు రావడంలేదని మోల్లేటి దేవి గోకవరం మండలంలో తిరుమలాయపాలెంలో కో–ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ వద్ద వాపోయారు. రోడ్లు, డ్రెయిన్లు లేకపోవడంతో వర్షం వస్తే ఇబ్బందులకు గురవుతున్నామని తలారి అనంతలక్ష్మి, జిక్కి మంగ సామర్లకోట మండలం చంద్రంపాలెం కొత్త కాలనీలో కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడుకు ఫిర్యాదు చేశారు. చినుకుపడితే ముంపునకు గురవుతోందని బి.సునీత కాకినాడ సిటీ 8వ డివిజన్ సాంబమూర్తినగర్‌లో కో–ఆర్డినేటర్ ముత్తా శశిధర్‌కు వివరించింది. జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో స్థానికులు పలు సమస్యలు పార్టీ కో–ఆర్డినేటర్ల దృష్టికి తీసుకువచ్చారు. -
సంక్షేమానికి పాతర
జన్మభూమి కమిటీలు చెప్పిందే వేదం అర్హులకూ అందని పింఛన్లు, రేషన్ కార్డులు ఊరూరా బాధితుల వెతలు ‘గడప గడపకూ వైఎస్సార్’లో వైఎస్సార్ సీపీ నేతల వద్ద ఆవేదన ∙రావులపాలెం మండలం కొమరాజులంకలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కార్యక్రమం నిర్వహించారు. తనకు వితంతు పింఛను రావడం లేదని, ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా జన్మభూమి కమిటీ పక్కనబెట్టిందని, న్యాయం చేయాలంటూ అరపల్లి అనంతలక్ష్మి అనే మహిళ ఆయనకు పింఛను దరఖాస్తు ఇచ్చింది. తన భర్త చనిపోతే రేషన్‌కార్డు తొలగించారని, అంత్యోదయ కార్డు ఇవ్వలేదని గంగిశెట్టి వరలక్ష్మి వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. ∙కాకినాడ కార్పొరేషన్ ఒకటో డివిజన్లోని గొల్లపేట, రమణయ్యపేట మార్కెట్లలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు నిర్వహించారు. రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని, పారిశుధ్యం సరిగా లేదని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రచారకమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం నేత లింగం రవి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పాలగొమ్మి నాగరాణి పాల్గొన్నారు. ∙పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం వక్కలంకలో కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర నాయకులు పీకే రావు పాల్గొన్నారు. గృహ రుణాలు, ఆరోగ్యశ్రీ వంటి సమస్యలను స్థానికులు వివరించారు. ∙ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తొల్లంగిలో అదనపు కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ నిర్వహించారు. తాగునీరు, డ్రెయినేజీ సమస్యలను స్థానికులు వివరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలెపు ధర్మారావు, కొప్పిశెట్టి బాలకృష్ణ పాల్గొన్నారు. ∙అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఎస్టీ రాజాపురంలో ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నిర్వహించారు. తమకు ఇంటి రుణం రాలేదని మట్టా సత్యవేణి వాపోయింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా అధికార ప్రతి నిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి లంక చంద్రన్న, ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మోకా సూరి బాబు, మండల కన్వీనర్ నల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ∙రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగిలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతం ఉదయభాస్కర్ నిర్వహించారు. మండల కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ,జిల్లాస్టీరింగ్ కమిటీసభ్యులు చోప్పా నూకరాజు పాల్గొన్నారు. ∙పిఠాపురం నియోజకవర్గం గోల్లప్రోలు మండలం కొడవలిలో ఈ కార్యక్రమం జరిగింది. తాగునీరు, ఇళ్ల స్థలాల సమస్యలను స్థానికులు పార్టీ కోఆర్డినేటర్ పెండెం దొరబాబుకు విన్నవించారు. ∙జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం సుబ్బాయమ్మపేటలో కోఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ఈ కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లు ఇవ్వడం లేదని, ఇళ్ల రుణాలు మంజూరు కాలేదని స్థానికులు పేర్కొన్నారు. ∙ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో కోఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ నిర్వహించారు. ముంపు సమస్యపై చింతపల్లి మేరీ, తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని పైల రూపావతి వివరించారు. కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ∙సామర్లకోట పట్టణం 14, 15 వార్డుల్లోని బలుసులపేటలో ఈ కార్యక్రమాన్ని పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు నిర్వహించారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జిగిని వీరభద్రరావు, ఆవాల లక్ష్మీనారాయణ, కంతే వీరరాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ∙మండపేటలోని 17వ వార్డులో ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి నిర్వహించారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి, స్థలం చూపలేదని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టెంకె వెంకటరావు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రెడ్డి రాజబాబు పాల్గొన్నారు. -
బాబు మాటలు నమ్మి మోసపోయాం
గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజల మనోగతం రాజంపేట టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని పలువురు ప్రజలు వైఎస్సార్సీపీ నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లాలోని రాజంపేట, బద్వేలు నియోజకవర్గాల పరిధిలో గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. రాజంపేటలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి బోయపాలెం 2, ఈడిగపాళెం వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఆయనతో మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ మాటలు నమ్మి నిలువునా మునిగామని పలువురు మహిళలు వాపోయారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామన్నారు. అలాగే పోరుమామిళ్ల మండలంలోని బొప్పాపురం, చెన్నారెడ్డిపేట, దళితవాడల్లో నిర్వహించిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, అధికార ప్రతినిధి సింగమాల వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు సి.యం బాషా తదితరులు ఇంటింటికి వెళ్లి కరపత్రాల పంపిణీ చేస్తూ చంద్రబాబు పాలనను వివరించారు. బాబు పాలన సమస్తం అవినీతిమయంగా మారిందన్నారు. దీనిపై స్పందించిన జనం భవిష్యత్తులో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామన్నారు.