
కూకట్ పల్లి లడ్డూకు రికార్డు ధర
హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి అడ్డుగట్ట సొసైటీలోని గణేశుని లడ్డూకు రికార్డు ధర పలికింది. గణేశుని నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన వేలంలో లడ్డూ ధర రూ.15 లక్షలు పలికింది. ఈ లడ్డూను నెల్లూరుకు చెందిన చంటిరెడ్డి దక్కించుకున్నారు. జంటనగరాల్లో ఇప్పటివరకూ నిర్వహించిన గణేశుని లడ్డూల వేలంలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం.
దీని తర్వాత బాలాపూర్ లడ్డూను రూ.10.32 లక్షలకు కళ్లెం మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా బడంగ్ పేట్ గణేశుని లడ్డూ రూ. 6.50 ధర పలికింది.