రైతుల సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వం
రైతుల సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వం
Published Thu, Sep 29 2016 9:57 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
యాదగిరిగుట్ట : రైతన్నల సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుందని డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బతుకమ్మ, పుష్కరాలు, బోనాల పండుగలకు రూ. కోట్లు ఖర్చు చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం, రాష్ట్రంలో అన్నదాతలు రుణామాఫీలు చేయడంలో వెనుకడుగు ఎందుకు వేస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలన చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో సగం మంది రైతుల రుణాలు మాఫీ చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసే మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు శాస్త్రీయ పద్ధతిలో చేయాలని ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీర్ల అయిలయ్య, గుండ్లపల్లి భరత్‌గౌడ్, ఎంపీటీసీ సాధూనేని మ«ధుకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానుగు బాలరాజు గౌడ్, శివరాత్రి దానయ్య, గడ్డమీది మాధవులు, బాలయ్య, గుజ్జ శ్రీనివాస్, పెలిమెల్లి చిన్నవెంకట్, కరణ్‌గౌడ్ తదితరులున్నారు.
Advertisement
Advertisement