‘పోలీస్‌ పవర్‌’లో గుర్రపుతండా విద్యార్థులు | gurraputhanda students in police power | Sakshi
Sakshi News home page

‘పోలీస్‌ పవర్‌’లో గుర్రపుతండా విద్యార్థులు

Published Thu, Jul 21 2016 7:42 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

‘పోలీస్‌ పవర్‌’లో గుర్రపుతండా విద్యార్థులు - Sakshi

‘పోలీస్‌ పవర్‌’లో గుర్రపుతండా విద్యార్థులు

పెద్దఅడిశర్లపల్లి : జొన్నలగడ్డ శివ దర్శకత్వంలో నిర్మిస్తున్న పోలీస్‌ పవర్‌ చిత్రంలోని ఓ ఫైట్‌ సన్నివేశంలో మండలంలోని పేర్వాల పంచాయతీ పరిధిలోని గుర్రపుతండాకు చెందిన అలేకియా బంజార ఆంగ్ల మాధ్యమ పాఠశాలకు చెందిన 13 మంది విద్యార్థులతో పాటు కరాటే మాస్టర్‌ రవినాయక్‌ గురువారం పాల్గొన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ జొన్నలగడ్డ శివ నటిస్తున్నారు. ఫైట్‌ మాస్టర్‌గా అభిలాశ్‌ నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. షూటింగ్‌లో పాల్గొన్న విద్యార్థులు సునీల్, సురేశ్, నరేశ్, చింటు, జగన్, విజయ్‌కుమార్, సతీశ్, జగన్, అనిల్, ప్రణయ్, ప్రవీణ్, గిరిబాబు, మునిలను పాఠశాల కరస్పాండెంట్‌ సుజాత నాయక్, ప్రిన్సిపాల్‌ సామ్యేల్‌కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement