హై అలర్ట్ ప్రకటనతో పోలీసు తనిఖీలు
Published Mon, Oct 3 2016 11:16 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
కాకినాడ సిటీ:
దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధవాతావరణం దృష్ట్యా కేంద్రం హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆదేశాల మేరకు పోలీసులు సోమవారం రాత్రి ఎక్కడిక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాకినాడ వన్ టౌన్, టూటౌన్, త్రీటౌన్, పోర్టు సీఐలు ఏఎస్.రావు, డీఎస్.చైతన్యకృష్ణ, వి.దుర్గారావు, ఎ.రాంబాబు ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది ఆయా ప్రాంతాల్లోని లాడ్జిల్లో విస్తృతంగా సోదాలు చేశారు. లాడ్జిల్లో ఉన్న వారి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పోర్టు, టౌన్ రైల్వేస్టేషన్లు, బస్‌డిపోలోనూ, రహదారుల్లో వాహనాల తనిఖీలు నిర్వహించి అనుమానితులను ప్రశ్నించారు.
Advertisement