అమలాపురంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు | KCR birthday celebrations in Amalapuram | Sakshi
Sakshi News home page

అమలాపురంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

Feb 18 2016 2:25 AM | Updated on Aug 14 2018 10:54 AM

అమలాపురంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు - Sakshi

అమలాపురంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.

అమలాపురం : తెలంగాణ  సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ  రాష్ట్ర సీమాంధ్రుల ఐక్యవేదిక (టీఎస్‌ఎస్‌యూఎఫ్) రాష్ట్ర కన్వీనర్ సంగినీడి సీతారామ్ ఆధ్వర్యంలో స్థానిక భూపయ్య అగ్రహారంలోని లూయీ అంధుల పాఠశాలలో  కేక్ కట్ చేసి పండ్లు పంచారు.

ఈ సందర్భంగా సంగినీడి మాట్లాడుతూ.. కేసీఆర్ గత 18 నెలల కాలంలో ప్రాంతీయ భేదాలు వీడి, అక్కడి సీమాంధ్రులను సోదరుల్లా అక్కున చేర్చుకున్నారన్నారు. రాష్ట్రాలు వేరైనా ప్రాంతాలు ఒక్కటే అన్న నినాదంతో సీమాంధ్రుల ఐక్యవేదిక సాగుతోందని, తెలంగాణ లో అమలయ్యే సంక్షేమ పథకాలు అక్కడి సీమాంధ్రులందరికీ అందేలా కృషి చే స్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు చాగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement