'మీ గ్రామస్తుడినే కాబట్టి నిధులకు కొరత ఉండదు' | kcr promises, erravalli should be an idol village | Sakshi
Sakshi News home page

'మీ గ్రామస్తుడినే కాబట్టి నిధులకు కొరత ఉండదు'

Published Thu, Aug 20 2015 3:12 PM | Last Updated on Thu, Jul 11 2019 7:45 PM

'మీ గ్రామస్తుడినే కాబట్టి నిధులకు కొరత ఉండదు' - Sakshi

'మీ గ్రామస్తుడినే కాబట్టి నిధులకు కొరత ఉండదు'

మెదక్: వచ్చే ఆరునెలల్లో ఎర్రవల్లి గ్రామస్వరూపాన్ని సమూలంగా మార్చివేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. జిల్లాలోని ఎర్రవల్లిలో గురువారం గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్..  ఆ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చుదిద్దుతానని తెలిపారు. 'నేను మీ గ్రామస్తుడినే. అందుచేత నిధులకు కొరత ఉండదు. వచ్చే ఆరునెలల్లో ఎర్రవల్లిని బంగారు వల్లిగా తీర్చిదిద్దుతాం' అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎర్రవల్లి గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా మెదక్ జాయింట్ కలెక్టర్ నియమిస్తున్నట్లు తెలిపారు.

 

రేపు ఎర్రవల్లిలో గ్రామ ప్రజలతో కలిసి కేసీఆర్ శ్రమదానం కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రజలతో సహపంక్తి భోజనం, ఎల్లుండి మొక్కలు నాటే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు కేసీఆర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement