
కొండ చిలువల కలకలం
ఆకివీడులో రెండు కొండ చిలువలు సోమవారం కలకలం సృష్టించాయి.
ఒక్కో కొండ చిలువ 10 అడుగుల పొడవు ఉంది. కొద్దిరోజులుగా మెట్ట ప్రాంతం నుంచి ఎర్ర కంకరను లారీల్లో తీసుకువచ్చి స్థానిక ఆదర్శ స్కూల్ వద్ద నిల్వ ఉంచారు. ఎర్రకంకరతో పాటు కొండ చిలువలు లారీల్లో వచ్చి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.