రగులుతున్న ఫ్లెక్సీ వివాదం | kottu satyanarayana flexi issue | Sakshi
Sakshi News home page

రగులుతున్న ఫ్లెక్సీ వివాదం

Published Sat, Oct 22 2016 6:20 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

రగులుతున్న ఫ్లెక్సీ వివాదం - Sakshi

రగులుతున్న ఫ్లెక్సీ వివాదం

–కొట్టు సత్యనారాయణను అరెస్టు చేసిన పోలీసులు 
–బెయిల్‌పై విడుదల 
–అధికారపార్టీ నాయకులు దమనకాండ çసృష్టిస్తున్నారని కొట్టు ఆగ్రహం 
తాడేపల్లిగూడెం:
వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా స్వాగతద్వారం ఏర్పాటుచేసే విషయంలో తలెత్తిన వివాదం ఇంకా రగులుకుంటోంది. ఈ నేపధ్యంలో జరిగిన ఘర్షణ , వివాదానికి సంబంధించి కొట్టు సత్యనారాయణపై అధికారపార్టీ  నాయకుల ఫిర్యాదుమేరకు పట్టణ పోలీసులు కేసులు నమోదుచేశారు. దీనికి గాను కొట్టు అనుచరులు ఆరుగురిని అరెస్టు చేయడం. వారికి బెయిల్‌ రావడంతో బయటకు రావడం జరిగింది. ఈ కేసులో మొదటినిందితునిగా 307 ( హత్యాయత్నం) వంటి సెక్షన్ల కింద కొట్టుసత్యనారాయణపై కేసు నమోదుచేశారు. ఈ సెక్షన్లతో పాటు దెబ్బలతో గాయపర్చినట్టు 324, అక్రమ నిర్భందం అభియోగంపై 341 సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. వాస్తవానికి 307 సెక్షన్‌ మినహా మిగిలిన సెక్షన్లకు స్టేషన్‌ బెయిల్‌పై నిందితులను బయటకు పంపించవచ్చు. ఈ క్రమంలో కేసులో ఏవన్‌గా ఉన్న కొట్టు సత్యనారాయణను శనివారం ఉదయం 11 గంటల సమయంలో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటుకొని, అనంతరం ఉంగుటూరు మండలం పట్టంపాడులోని ఆంజనేయస్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లడానికి కొట్టు సత్యనారాయణ తన వాహనంలో బయలుదేరారు. ఆయన వాహనం చినతాడేపల్లి అండర్‌పాస్‌ దాటేసరికి పోలీసులు ఆయన వాహనాన్ని ఆపి .అరెస్టు చేసినట్టు తెలిపారు. అక్కడి నుంచి హౌసింగ్‌బోర్డు కాలనీ మీదుగా పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చారు. రికార్డుల పూర్వకంగా 11.30 కి అరెస్టు చేసినట్టు చూపించారు. అనంతరం ఆయనను పోలీసు వాహనంలో వైద్య పరీక్షల నిమిత్తం 11.55కు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం 12.20కు అడిషినల్‌ జ్యుడీషియల్‌ ఫస్టు క్లాసు మేజిస్ట్రేట్‌ కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. ఆయనపై 307 సెక్షన్‌కింద కేసునమోదుచేసినప్పటికి , గతంలో ఇదే కేసుకు సంబంధించి కొట్టు అనుచరులను ఏ సెక్షన్లకింద బెయిల్‌ మంజూరుచేసి విడుదల చేశారో , అదే సెక్షన్లకింద బెయిల్‌ను ఏజేఎఫ్‌సీఎం ఎంవీఎస్‌పద్మజ మంజూరుచేశారు. కొట్టు సత్యనారాయణపై స్వాగతద్వారం,ప్లెక్సీ ఏర్పాటు వివాదాల నేపధ్యంలో 307(హత్యాయత్నం) దెబ్బలతో గాయపర్చడం ( 324) అక్రమ నిర్భంధం( 341) సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఈ వివాదంలో 307 సెక్షన్‌ వర్తించే అవకాశంలేకపోవడంతో న్యాయమూర్తి  వర్తించే సెక్షన్లను అనుసరించి తీర్పునిచ్చినట్టు సమాచారం., బెయిల్‌పై కోర్టునుంచి బయటకు వచ్చిన కొట్టు సత్యనారాయణ అప్పటికే ఆయన రాక కోసం వేచిఉన్న అభిమానులు, అనుచరులు, పార్టీ నాయకులతో కలిసి ఊరేగింపుగా కేఎన్‌రోడ్డు మీదుగా.బస్టాండ్, మంత్రి క్యాంపు కార్యాలయం, నివాసగహం మీదుగా కొట్టు నివాసగహానికి చేరుకున్న అనంతరం , ఘటన నేపధ్యం. అధికార పార్టీ నాయకుల దమనకాండ విషయాలగురించి మాట్లాడారు. 
పార్టీ శ్రేణుల ఆందోళన 
కొట్టు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారన్న వార్త నియోజకవర్గంలో దావానలంలా వ్యాప్తి చెందడంతో  కొట్టు అభిమానులు, అనుచరులు. పార్టీ నాయకులు కొందరు కొట్టు పోలీసు స్టేషన్‌కు చేరుకొనే సమయానికి అక్కడికి చేరుకున్నారు. కొట్టు వెంట స్టేషన్‌లోపలికి తాము వస్తామంటూ మహిళా నాయకులు పట్టు పట్టారు. నిరసన తెలిపే ప్రయత్నాలు పార్టీ క్యాడర్‌ చేయతలపెట్టినప్పటికి పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి కొట్టును కోర్టులో హాజరుపర్చడం దగ్గర నుంచి ఆయన ఇంటికి చేరేవరకు కోర్టు పరిసర ప్రాంతాలలో బయట,గుంపులు గుంపులుగా ప్రజలు, అభిమానులు ఒకే చోట ఉండకుండా ^è ర్యలు తీసుకున్నారు. కొట్టు కోర్టు నుంచి ఇంటికి చేరే వరకు మార్గం పొడవునా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఉద్రిక్త పరిస్ధితులు తలñ త్తకుండా సీఐలు ఎంఆర్‌ఎల్‌ఎస్‌మూర్తి, మధుబాబు, సర్కిల్‌పరిధిలోని ఎస్‌ఐలు, జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్న స్వాగతద్వారం ఏర్పాటు విషయం పెద్ద వివాదానికి  దారితీసిన నేపధ్యంలో ఎలాంటి విపత్కర పరిణామాలు చోటుచేసుకోకుండా అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. కొట్టు అరెస్టు , బెయిల్‌పై విడుదల , తదనంతర పరిస్ధితులపై కొవ్వూరు డీఎస్‌పీ నర్రా వెంకటేశ్వరరావు పట్టణ పోలీసు స్టేషన్‌లో సమీక్షించారు. 
దమనకాండ సష్టిస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు 
అధికార పార్టీ నేతలపై కొట్టు ధ్వజం 
అధికారం చేతిలో ఉంది కదా అని బీజేపి. టీడిపి నాయకులు దమనకాండ సష్టిస్తున్నారని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. బెయిల్‌పై విడుదలైన ఆయన  విలేఖర్లతో మాట్లాడారు. ప్రశ్నిస్తే 307 సెక్షన్‌ కింద కేసులు కడుతున్నారు. ఓట్లేసిన ప్రజలందరిపై కూడా ఇదే సెక్షన్‌కింద కేసులు కట్టేస్తారేమో అన్నారు. పుట్టిన రోజు సందర్భంగా వీధి చివర స్వాగత బ్యానర్లను నా అభిమానులు పదేళ్లుగా కడుతున్నారు. ఈ నెల 18 వ తేదీ రాత్రి అదే విధంగా స్వాగత ద్వారం ఏర్పాటుచేయడానికి ప్రయత్నం చేశారన్నారు. అభిమానులు పట్టణం నిండుగా బ్యానర్లు కట్టడం .స్వాగత ద్వారాలు ఏర్పాటుచేయడం పట్ట అసూయకలిగిన అధికారపార్టీ నాయకులు వాటిని తొలగించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. నా అభిమానులను , వైసీపి శ్రేణులను అణగదొక్కాలనే కుట్రతో . ప్రభుత్వంలో  క్యాబినెట్‌ స్ధాయి మంత్రిగా ఉండి కూడా సర్ధుబాటు చేయడం మాని ఇక్కడి ప్రజాప్రతినిధి  వివాదం చేశారని దుయ్యబట్టారు. బీజేపి. టీడిపి గూండాలు అడ్డుపడి నా అభిమానులను కొట్టి గాయపర్చారని చెప్పారు. అధికార పార్టీ నాయకులు ఇంత దమనకాండ సష్టిస్తున్నా. పోలీసులు అక్కడ ఉండి కూడా ప్రేక్షక పాత్ర వహించారని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపి నాయకుల బ్యానర్‌ జోలికి వైసీపి శ్రేణులు వెళ్లలేదన్నారు. మంత్రి ఆదేశాలతో మునిసిపల్‌ చైర్మన్‌ ఘటనా స్ధలంలో వివాదం సష్టించారని విమర్శించారు. కొవ్వూరు డీఎస్‌పీ  విషయాన్ని సర్ధుబాటు చేస్తానని చెప్పగా ఘటనాస్ధలం నుంచి  ఇంటికి వెళ్లిపోయానని కొట్టు చెప్పారు. తాను వెళ్లిపోయిన తర్వాత తన పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయన్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న మంత్రి చేసిన వీరంగం అంతా ఇంతాకాదన్నారు. ఆ విషయాన్ని ప్రజలు గమనించారన్నారు. చిన్న తగవుకు 307 సెక్షన్‌ కింద కేసులు నమోదుచేస్తారా అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా ఐదేళ్లపాటు రౌడీయిజం, గూండాయిజం పట్టణంలో లేకుండా అణచివేసిన సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. ఎవ్వరు పట్టణంలో శాంతిభద్రతలను రక్షించారో ప్రజలందరికి తెలుసన్నారు. మహిళలకు, ప్రజలకు రక్షణ కల్పించిన చరిత్ర తనకుందని ఆయన చెప్పారు. మంత్రిస్దాయిలో ఉండి ఓ పోలీసు అధికారిని నీచస్దాయిలో దూషణ చేస్తారా అన్నారు. వివాదానికి సంబంధం లేని వారిపై కేసులు నమోదుచేయడం నీచాతినీచం అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉండగా అభివద్దికి పునాదులు వేశానని, ఆ పనులు ముందుకు సాగకుండా ఇక్కడి ప్రజా ప్రతినిధులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఆర్దిక పరిస్దితి అంతగా లేని నేతలు కొందరు రెండున్నరేళ్లలో కోట్లకు ఎలా పడగలెత్తారని ప్రశ్నించారు. కేసులు, అక్కర్లేని సెక్షన్లను బనాయించడంపై పోలీసులు ఆత్మసాక్షిగా పునశ్చరణ చేసుకోవాలని కొట్టు కోరారు. ప్రజాప్రతినిధులు వత్తిడిచేస్తే కేసులు నమోదుచేస్తారా. ఘటన జరిగిన నాటినుంచి ఈ నాటి వరకు పట్టణం వదిలి వెళ్లలేదన్నారు. చిన్న ఘటనకు పోలీసులు బనాయించిన 307 సెక్షన్‌ వర్తించదని న్యాయమూర్తి చెప్పే పరిస్ధితి వచ్చిందంటే పరిస్దితి ఎలా ఉందో అర్ధంచేసుకోవచ్చన్నారు. ఇలాంటి దారుణపాలన , వ్యవస్ధ 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని కొట్టు అన్నారు. భగవంతుడు మన పక్షాన ఉన్నాడు. కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా ఉండాలని కోరారు. త్వరలో మంచి రోజులు వస్తాయి. ఓపిక పట్టమనికోరారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement