
సంచికను విడుదల చేస్తున్న కేవీరమణాచారి తదితరులు
రాష్ర్ట ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, దత్తగిరి మహరాజ్ ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహరాజ్ చేతులమీదుగా కృష్ణా పుష్కరాల సంచికను విడుదల చేశారు.
ఝరాసంగం రూరల్: రాష్ర్ట ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, దత్తగిరి మహరాజ్ ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహరాజ్ చేతులమీదుగా కృష్ణా పుష్కరాల సంచికను విడుదల చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కేవీ రమణాచారి చాంబర్‌లో కృష్ణా పుష్కరాల ప్రాముఖ్యత, పుష్కరాల సమయాలు, ఘట్టాలు, ఆశ్రమం తరఫున భక్తులకు అందించే సేవలకు సంబంధించిన సంచికను విడుదల చేశారు. పూర్వం నుంచి వేద పండితులు పుష్కరాల ప్రాముఖ్యతను తెలుపుతున్నట్లు అనేక గ్రంథాల్లో ఉన్నదని రమణచారి, పీఠాధిపతి అవధూతగిరి మహరాజ్ తెలిపారు. పుష్కరాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరు పూనీతులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.