వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చుదాం
జిల్లా కలెక్టర్ సత్యనారాయణ
గూడూరు: సాంకేతిక పరిజా్ఞనాన్ని ఉపయోగించుకొని వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చుకుందామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రైతులకు పిలుపునిచ్చారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక ఎలిమెంటరీ పాఠశాల ఆవరణలో ‘వ్యవసాయం –అనుబంధ రంగాలు అనే అంశంపై సదస్సునిర్వహించారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి మల్లికార్జున అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ... ప్రస్తుతం వ్యవసాయరంగం కష్టతరంగా మారిందన్నారు. అధిక పెట్టుబడుల జోలికి వెళ్లకుండా తక్కువ పెట్టుబడితో పంటలు సాగు చేయాలన్నారు. ఉద్యాన వన పంటలు , కూరగాయల సాగుపై దృష్టిసారించాలని సూచించారు. డ్రిప్ , స్పింక్లర్ల సేద్యం అలవాటు చేసుకోవాలని కోరారు. అనంతరం వ్యవసాయ, దాని అనుంబంధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో కర్నూలు ఏడీఎ రమణారెడ్డి, డ్రిప్ ఇరిగేషన్ ఏడీ ఫయాజ్ , మండల నోడల్ అధికారి సత్యనారాయణ, ఎంపీపీ ఈశ్వరమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ కె.రామాంజినేయులు, కోడుమూరు, గూడూరు, సి.బెళగల్ , కర్నూలు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఓలు పాల్గొన్నారు,