ఉరేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మేళ్లచెర్వు:
ఉరేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేళ్లచెరువులో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ .రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన కాకునూరి శ్రీనివాసరెడ్డి(50) స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా భార్యతో గొడవలు వచ్చి విడిగా ఉంటున్నారు. దీంతో శ్రీనివాసరెడ్డి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ఆమె కూడా వెళ్లి పోవడంతో అసహనానికి గురై తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.