చిత్తూరు : చిత్తూరు జిల్లా పీలేరు మండలం మేళ్లచెర్వులో దారుణం జరిగింది. భూ తగాదాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. పున్నామ నరకం నుంచి కాపాడాల్సిన ఆ తనయుడు క్షణికావేశానికి లోనై కన్నతండ్రినే హతమార్చాడు. శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న కేశవరెడ్డికి... కొడుకు విశ్వనాథ్ రెడ్డికి గత కొంతకాలంగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి.
ఈ రోజు ఉదయం అదికాస్తా తారాస్థాయికి చేరటంతో విశ్వనాథ్ రెడ్డి ...తండ్రిపై దాడి చేయటంతో అతను తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన కృష్ణయ్య అనే వ్యక్తి ప్రశ్నించటంతో కోపం పట్టలేని విశ్వనాథ్ రెడ్డి ...అతడిపై కూడా దాడి చేయటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాంతో చుట్టుపక్కలవారు....విశ్వనాథ్రెడ్డిని బంధించి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, విచారణ జరుపుతున్నారు.
తండ్రితో పాటు పక్కింటి వ్యక్తిని హతమార్చాడు
Published Sat, Aug 2 2014 12:50 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement
Advertisement