
సాక్షి, చిత్తూరు: ఆస్తి తగాదాల విషయంలో ఓ మహిళపై సమీప బంధువులు విచక్షణారహితంగా దాడి చేశారు. చిత్తూరు జిల్లా కెవి పల్లె మండలం పాపిరెడ్డిగారి పల్లెలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్థులైన సమీప బంధువులు కత్తులతో తెగబడటంతో తులసి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తులసి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తులసిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది పథకం ప్రకారం జరిగిన దాడి అని తులసి భర్త అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ‘నన్ను నా భార్యను చంపడానికి పథకం ప్రకారం దాడి చేశారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
(రిటైర్డ్ ఐఏఎస్ పేరుతో డబ్బులు వసూలు, అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment