రూ.7 కోట్లతో మార్కెట్‌ యార్డుల అభివృద్ధి | market yard develops from rs.7 crores | Sakshi
Sakshi News home page

రూ.7 కోట్లతో మార్కెట్‌ యార్డుల అభివృద్ధి

Published Thu, Oct 20 2016 10:13 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

జిల్లావ్యాప్తంగా మార్కెట్‌యార్డుల్లో రూ.7 కోట్ల బడ్జెట్‌తో వివిధ అభివద్ధి పనులు, నిర్మాణాలు జరుగుతున్నాయని మార్కెటింగ్‌శాఖ రాయలసీమ జిల్లాల ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు కె.జయశేఖర్‌ అన్నారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లావ్యాప్తంగా మార్కెట్‌యార్డుల్లో రూ.7 కోట్ల బడ్జెట్‌తో వివిధ అభివద్ధి పనులు, నిర్మాణాలు జరుగుతున్నాయని మార్కెటింగ్‌శాఖ రాయలసీమ జిల్లాల ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు కె.జయశేఖర్‌ అన్నారు. గురువారం జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక మార్కెట్‌యార్డు ప్రాంగణంలో నిర్మిస్తున్న కవర్‌షెడ్, షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులను పరిశీలించారు. పనులు నత్తనకడన సాగుతుండటంపై అసంతప్తి వ్యక్తం చేస్తూ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

శుక్ర, శనివారం కళ్యాణదుర్గం, రాయదుర్గం, కనేకల్లు, ధర్మవరం, కదిరి, హిందూపురం, మడకశిర యార్డుల్లో జరుగుతున్న పనులను పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గోదాములు, రైపనింగ్‌ చాంబర్లు, కవర్‌షెడ్డు, షాపింగ్‌ క్లాంపెక్స్‌ నిర్మాణాలకు రూ.7.02 కోట్లు నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి అనంతపురం మార్కెట్‌యార్డులో క్రయవిక్రయాలు ఈ–మార్కెటింగ్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఏడీ బి.హిమశైల తెలిపారు. అందుకు సంబంధించి కంప్యూటర్లు, ఇతరత్రా సామగ్రి, పనులు జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈ జి.నాగభూషణం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement