ఆస్పరి: వేధింపులు తాళలేక తంగరడోణ గ్రామానికి చెందిన ఉరకుందమ్మ (28) అనే మహిళ ఆదివారం పొలంలో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.ఎస్‌ఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. పెద్ద కడుబూరు మండలం దొడ్డిమేకల గ్రామానికి చెందిన ఉరుకుందమ్మను, ఆస్పరి మండలం తంగరడోణ గ్రామానికి చెందిన హుసేనితో పది సంవత్సరాలు క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఉరుకుందమ్మను భర్త హుసేని, అత్త శాంతమ్మ, మామ రామలింగప్ప, మరిది నరసింహులు అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురి చేసేవారని ఎస్‌ఐ తెలిపారు. వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన ఉరుకుందమ్మ పొలంలో పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామ, మరిదిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. మృతి దేహన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.