మంత్రి జూపల్లి, రేవంత్రెడ్డి మధ్య వాగ్వాదం | minister jupally krishna rao vs revanth reddy in mahabubnagar | Sakshi
Sakshi News home page

మంత్రి జూపల్లి, రేవంత్రెడ్డి మధ్య వాగ్వాదం

Published Thu, Jun 9 2016 4:35 PM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

మంత్రి జూపల్లి, రేవంత్రెడ్డి మధ్య వాగ్వాదం - Sakshi

మంత్రి జూపల్లి, రేవంత్రెడ్డి మధ్య వాగ్వాదం

మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బాహాబాహీకి దిగారు. కోస్గి మండలం భోగారంలో గురువారం రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్యక్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మంత్రి జూపల్లి ప్రసంగిస్తూ...తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దీంతో రెచ్చిపోయిన రేవంత్ జూపల్లి చేతిలో ఉన్న మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, తోపులాటకు దారి తీసింది. సభలో ఉన్న టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement