మూడేళ్ల చిన్నారితో సహా తల్లి అదృశ్యం | mother missing nakerekal | Sakshi
Sakshi News home page

మూడేళ్ల చిన్నారితో సహా తల్లి అదృశ్యం

Published Sat, Aug 27 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

మూడేళ్ల చిన్నారితో సహా తల్లి అదృశ్యం

మూడేళ్ల చిన్నారితో సహా తల్లి అదృశ్యం

నకిరేకల్ః  
మూడేళ్ల చిన్నారితో సహా ఓ తల్లి అదృశ్యమైంది. నకిరేకల్‌లో ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు..  మండలంలోని మండలాపురం గ్రామానికి చెందిన తీగల యోహన్‌ సోదరి రమణ(32) కృష్ణాజిల్లా చిల్లకల్లు మండలం తిరుమలగిరికి చెందిన మార్కపురి ఆదమ్‌తో వివాహం జరిగింది. ఆదమ్‌ తిరుమలగిరిలోనే పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. మార్కపురి ఆదమ్‌ రమణ దంపతులకు ఇద్దరు కుమారులు,  కుమార్తె ఉన్నారు. ఈనెల 18వ తేదీన రాఖీ కట్టేందుకు తిరుమలగిరి నుంచి రమణ తన మూడేళ్ల కూతురు పల్లవితో  నకిరేకల్‌కు విచ్చేసింది. ఈనెల 24న అన్న తీగల యోహన్‌ తన సోదరి రమణను, కూతురు పల్లవిని సూర్యపేటకు వెళ్లే ఆటో ఎక్కించాడు. అక్కడి నుంచి తిరుమలగిరి వెళ్తానని సోదరి రమణ అన్నతో తెలిపింది. 24న నకిరేకల్‌ నుంచి మూడేళ్ల కూతురు పల్లవితో బయలుదేరిన రమణ ఇంటికి చేరుకోలేదు. రెండు రోజులుగా ఎదురుచూసిన భర్త ఆదమ్‌ తన బావమరిది యోహన్‌కు తెలిపాడు. దీంతో శుక్రవారం నకిరేకల్‌ పోలీస్‌స్టేషన్‌లో తన సోదరి, మూడేళ్ల కూతురుతో తప్పిపోయిందని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ సుబ్బరామిరెడ్డి తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement