
చంద్రబాబు ఓ అబద్ధాల పుట్ట
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను వంచిస్తూ ఓ అబద్ధాల పుట్ట, దగాకోరుగా నిలిచారని గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి విమర్శించారు.
ముఖ్యమంత్రికి ఎస్సీ, ఎస్టీ, మైనా రిటీలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. రుణమాఫీ కాక, బ్యాంకర్ల నోటీసులతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, దీనికి సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది విపత్తు మూలాన పంటలు నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు బీమా పరిహారం ఇచ్చిన పాపానపోలేదని దుయ్యబట్టారు. అనంతరం కార్వేటినగంరలో జరిగిన సింగిల్‌విండో డైరెక్టర్ «ధనంజయవర్మ తల్లి కర్మక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట సింగిల్‌విండో అధ్యక్షుడు లోకనాథరెడ్డి, రైతు విభాగం జిల్లా కార్యదర్శి పద్మనాభశెట్టి, వెంకటరత్నం, శేషాద్రి తదితరులు ఉన్నారు.