విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం | narrow escape from boat accident in nagavali river | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Published Sat, Aug 6 2016 11:46 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

narrow escape from boat accident in nagavali river

శ్రీకాకుళం: స్కూలు విద్యార్థులతో వెళ్తున్న పడవకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం రంగరాయపురం వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. సంతకవిటి గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులు నాగావళి ఆవలి ఒడ్డున ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నారు. ఆ క్రమంలో శనివారం ఉదయం వారు బయలుదేరిన పడవకు నారాయణపురం అడ్డుకట్ట సమీపంలో దట్టంగా ఉన్న గుర్రపుడెక్క ఆకు అడ్డుపడింది. పడవ ముందుకు సాగలేదు. దీంతో పడవ మునిగిపోయే ప్రమాదంలో పడింది. ఈ దశలో సరంగులు అప్రమత్తమై పడవను వెనక్కి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement