విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు సమైక్యాంధ్ర సెగ తగిలింది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజనకు బ్రేక్ పడింది. 2011 జనాభా గణాంకాల ప్రకారం ఎంపీటీసీ స్థానాల లెక్క తేలినా.. ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగులందరూ సమైక్యాంధ్ర కోసం సమ్మె బాట పట్టడంతో ఈ ప్రక్రియ నిలి చిపోయింది. దీంతో అధికారులు పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సెప్టెంబర్ నెలాఖరులో మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ) ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం అధికారిక ప్రక్రియను ప్రారంభించింది. ఎంపీటీసీ స్థానాల పునర్విభజనకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా అధికారులు పునర్వభజన ప్రక్రియను పూర్తి చేశారు.
పెరిగిన ప్రాదేశిక స్థానాలు
జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. గతం లో 2006లో జరిగిన ఎన్నికల్లో 2001 జనాభా ఆధారంగా జరిగిన పునర్విభజన ప్రకారం 624 ంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 2011 జనాభా గణాంకాలు అందుబాటులోకి వచ్చాయి. దీని ప్రకారం గ్రామీణ ప్రాంత జనాభా 22.54 లక్షలు. ఈ జనాభా ఆ ధారంగా 3 వేలు నుంచి 4 వేలు జనాభా మిం చకుండా ఎంపీటీసీ స్థానాలను పునర్విభజిం చారు. దీంతో గతంలో కంటే 27 స్థానాలు పెరి గాయి. ఫలితంగా ఈసారి మొత్తం 651 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
నోటిఫికేషన్ వాయిదా
పునర్విభజన ప్రక్రియ పూర్తయినప్పటికీ ప్రాథమిక నోటిఫికేషన్ వాయిదా పడింది. వాస్తవానికి బుధవారమే ప్రైమరీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. దాని ప్రకారం అధికారులు ఎంపీటీసీ స్థానాల జాబితాను సిద్ధం చేసి.. దానిపై కలెక్టర్ సంతకం చేసినా కూడా సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ప్రచురణ జరిగే అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ వీటిపై 21వ తేదీలోగా అభ్యంతరాలను స్వీకరించి 22 నుంచి 26 వరకు వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. 27 తుది జాబితాను ప్రకటించా ల్సి ఉంది. కానీ ఉద్యోగులందరూ సమ్మెలో ఉండడంతో ఆ ప్రక్రియను చేపట్టేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకూ వీల్లేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ డి.వెంకటరెడ్డి తెలిపారు.
ఎన్నికలు మరింత వెనక్కు..
ఈసారి ప్రాదేశిక ఎన్నికలు మరింత జాప్యమ య్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల లోనే ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం ముందు ప్రకటించినప్పటికీ సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా పునర్విభజన ప్రకియే పూర్తి కాలేదు. ఉద్యోగులు సమ్మె విరమిస్తే గా నీ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం లేదు. తుది జాబితా ప్రకటించిన తరువాత దాన్ని ప్రభుత్వానికి పంపిస్తే వాటికి స ర్కారు రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది. జిల్లా లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ప్రకటించిన తరువాత వాటిని ఎన్నికల సం ఘానికి సమర్పిస్తే అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అధికారులు మాత్రం ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పా ట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 1933 పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఈ ఎన్నికలకు 4222 బ్యాలెట్ బాక్సులు అవసరమని గుర్తించారు.
‘ప్రాదేశిక ’ ప్రక్రియకు బ్రేక్
Published Thu, Aug 15 2013 3:21 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement
Advertisement