వీధిలో నాట్లు పెట్టి నిరసన
రత్నవరం(నడిగూడెం): మండల పరిధిలోని రత్నవరం గ్రామంలో ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా ఉన్నదని, దానికి మరమ్మతులు చేయలంటూ గురువారం గ్రామంలోని ప్రధాన రహదారిపై వరి నాట్లు పెట్టి నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఈ ప్రధాన రహదారి చినుకుపడితే చిత్తడిగా మారుతున్నదని, బురదమయంగా, ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత రోడ్లు, భవనాల శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన కరువైందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామిని విజయ్వర్దన్రెడ్డి, కాసాని శ్రీను, రామిని లక్ష్మారెడ్డి, రామిని శ్రీనివాసరెడ్డి, మొలుగూరి నర్సయ్య, గుండు రామచంద్రయ్య, చుక్కమ్మ, రాంబాయమ్మ, తిరపమ్మ, అన సూరమ్మ, తదితరులు పాల్గొన్నారు.