అనంతపురం మెడికల్ :
వైద్య ఆరోగ్యశాఖలో రెండు నోటిఫికేషన్లకు సంబంధించి మెరిట్ లిస్ట్‌ను శనివారం అధికారులు విడుదల చేశారు. జాబితాలపై అభ్యంతరాలుంటే ఈ నెల 20 లోగా తెలియజేయాలని డీఎంహెచ్‌ఓ వెంకటరమణ కోరారు. వివరాల్లోకి వెళితే.. 13వ ఫైనాన్స్ కమిషన్ కింద జిల్లాలో కొత్తగా ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించారు.
వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిలో 14 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 21 స్టాఫ్‌నర్సులు, ఏడు ఫార్మసిస్టు పోస్టుల భర్తీకి గతంలోనే దరఖాస్తులు ఆహ్వానించారు. వీటికి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్‌తోపాటు సెలెక్షన్ లిస్ట్, ఏడు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల రివైజ్డ్ ప్రొవిజినల్ జనరల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. అదేవిధంగా ఆర్‌బీఎస్‌కేలో కాంట్రాక్ట్ పద్ధతి కింద మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్), ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులను గతంలోనే స్వీకరించారు.
తాజాగా ఫార్మసిస్ట్‌లకు సంబంధించి ప్రొవిజినల్ జనరల్ మెరిట్ లిస్ట్, ఇతర క్యాడర్ల ఫైనల్ సెలెక్షన్ లిస్ట్‌లను విడుదల చేశారు. వీటిని ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌ఏఎన్‌టీఏపీయూఆర్‌ఏఎంయూ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జాబితాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆదివారం నుంచి 20లోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో తెలియజేయాల్సి ఉంటుంది.