పోలీసుల సంక్షేమమే ధ్యేయం
పామిడి : విద్య, వైద్య, ఆరోగ్య, ఆర్థిక చేయూత పరంగా పోలీసుల సంక్షేమమే పోలీస్ వెల్ఫేర్ ధ్యేయమని ఎస్పీ రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం పామిడిలోని పోలీస్ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఆయన సీఐ ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. సుమారు రూ.40 లక్షల నిధులతో కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా పామిడిలో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్, అక్రమ ఇసుక రవాణాపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ సానుకూలంగా స్పందించారు.
ట్రాఫిక్ నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డికి ఆదేశించారు. అంతకుముందు ఆయన కాంపెక్స్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ నిర్మాణంపై సంబంధిత సీఐ నరేంద్రరెడ్డి, ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డితో సమీక్షించారు. ఎస్పీ వెంట తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ నరేంద్రరెడ్డి, ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి ఉన్నారు.