
కరుణించు లక్ష్మీనారసింహా..
చిలమత్తూరు : కనుమ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన బ్రహ్మ రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. భక్తుల గోవింద నామస్మరణతో చిలమత్తూరు పులకించిపోయింది. మధ్యాహ్నం 1.45 గంటలకు రథోత్సవాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది.