నవ్యాంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీల ఆర్థిక పురోభివృద్ధి కోసం రూ.11,300 కోట్లు సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ చెప్పారు. స్థానిక ఇరిగేషన్ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీల కోసం రూ.8,300 కోట్లు ఎస్టీలకు రూ.3 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు కేటాయించి వారి అభివృద్ధికి ఖర్చు చేస
దళితుల అభివృద్ధికి రూ.11,300 కోట్లు
Published Wed, Nov 2 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజి
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : నవ్యాంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ, ఎస్టీల ఆర్థిక పురోభివృద్ధి కోసం రూ.11,300 కోట్లు సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ చెప్పారు. స్థానిక ఇరిగేషన్ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీల కోసం రూ.8,300 కోట్లు ఎస్టీలకు రూ.3 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు కేటాయించి వారి అభివృద్ధికి ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ప్రతి ప్రభుత్వ శాఖలో ఉద్యోగస్తుల హక్కులను రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రమోషన్ల కోసం చర్యలు చేపట్టామన్నారు. 19న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దళిత గిరిజన మహాగర్జన సభ ఏర్పాటు చేసి సీఎంకి అభినందన, సత్కారానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొలిమేర హరికృష్ణ, కార్పొరేటర్ రాయి విమలాదేవి, దళిత నాయకులు దాసరి ఆంజనేయులు, అబ్బూరి అనిల్, కె.శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement