స.హ. కార్యక్తరకు అవార్డు
స.హ. కార్యక్తరకు అవార్డు
Published Tue, Aug 16 2016 10:53 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎండీ అష్రఫ్ ఉత్తమ సమాచార హక్కు చట్టం కార్యకర్తగా ఎంపికయ్యారు. పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి జోగు రామన్న, కలెక్టర్ జగన్మోహన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కాగజ్‌నగర్‌కు చేరుకున్న అశ్రఫ్‌ను మంగళవారం పలువురు అభినందించారు.
ఈ సందర్భంగా అష్రఫ్ మాట్లాడుతూ 2006 నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా అనేక అవినీతి అంశాలను బయటకు తీసి ప్రభుత్వానికి 15 కోట్లకు పైగా ఆదాయం కల్పించినందుకు గాను తనను ఈ అవార్డు కోసం ఎంపిక చేసినట్లు వివరించారు. రానున్న రోజుల్లో కూడా అవినీతిపై సమరం సాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. పలువురు ఉపాధ్యాయులు, పట్టణ వాసులు అష్రఫ్‌కు అభినందనలు తెలిపారు. అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement