సీట్లు 9,303.. భర్తీ 5,996 | seats 9,303.. filled 5,996 | Sakshi
Sakshi News home page

సీట్లు 9,303.. భర్తీ 5,996

Published Tue, Jul 26 2016 7:15 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

seats 9,303.. filled 5,996

భీమవరం: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యే నాటికి జిల్లాలోని 22 కాలేజీలో కన్వీనర్‌ కోటాలో 9,303 సీట్లుకు 5,996 భర్తీ అయ్యాయి. 3,307 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఐదు కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. తొమ్మిది కళాశాలల్లో 50 శాతం వరకు, ఐదు కళాశాలల్లో 10 శాతంలోపు సీట్లు భర్తీ అయ్యాయి. తాడేపల్లిగూడెం ఆకుల శ్రీరాములు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. 
ఆల్‌ఫుల్‌ ..భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలో 1,050 సీట్లు,  శ్రీవిష్ణు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో 504,  ఏలూరు సీఆర్‌ఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో 588,  ఏలూరు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో 336, తాడేపల్లిగూడెం శ్రీవాసవీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో 504 సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యాయి.  
50 శాతంకు పైగా.. భీమవరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (భీమవరం)లో 252 సీట్లకు 130,  డీఎన్నార్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (భీమవరం)లో 378 సీట్లకు 201, జీవీవీఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (భీమవరం) 294 సీట్లకు 153 సీట్లు భర్తీ అయ్యాయి. రామచంద్ర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (ఏలూరు)లో 420 సీట్లకు 344, శశి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజినీరింగ్‌ (తాడేపల్లిగూడెం) 588 సీట్లకు 518 సీట్లు, స్వర్ణాంధ్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (నరసాపురం) 336 సీట్లకు 176 సీట్లు , స్వర్ణాంధ్ర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (నరసాపురం) 588 సీట్లకు 461 సీట్లు భర్తీ అయ్యాయి. శ్రీవిష్ణు ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్స్‌ (భీమవరం) 504 సీట్లకు 497, వెస్ట్‌ గోదావరి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (నల్లజర్ల) 252 సీట్లకు గాను 204 సీట్లు భర్తీ అయ్యాయి. 
అతి తక్కువగా.. తాడేపల్లిగూడెం ఆకుల శ్రీరాములు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో 378 సీట్లకు ఒక్కటీ భర్తీ కాలేదు. తణుకు ఆకుల శ్రీరాములు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో 336 సీట్లకు 26 సీట్లు, భీమవరం చైతన్య ఇంజినీరింగ్‌ కళాశాలలో 210 సీట్లకు 4, ఏలూరులోని హేలాపురి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌స్‌ కళాశాలలో 252 సీట్లకు 20, పాలకొల్లులో జోగయ్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టñ క్నాలజీ అండ్‌ సైన్స్‌స్‌ కళాశాలలో 294 సీట్లకు 2, భీమవరంలో శ్రీవత్సవాయి కృష్ణంరాజు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో 399 సీట్లకు 27 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement