తల్లిని చంపిన తనయుడు | son kills mother brutally for asking to get job | Sakshi
Sakshi News home page

తల్లిని చంపిన తనయుడు

Published Fri, Dec 23 2016 1:49 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

son kills mother brutally for asking to get job

కరీంనగర్: బీర్పూర్ మండలం రేకులపల్లిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సవ్వను ఆమె కుమారుడు రాజలింగం హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సవ్వ నాలుగో కుమారుడు రాజలింగం ఎంఏ ఎకనామిక్స్ చదివాడు. కొంత కాలంగా ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు.
 
ఖాళీగా ఉండకపోతే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు కదా అని కుమారుడికి నర్సవ్వ అనడంతో ఆగ్రహం తెచ్చుకున్న రాజలింగం తన తల్లిని బండరాయికేసి మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి నర్సవ్వ(80) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రాజలింగాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement