దువ్వాడ మీదుగా ప్రత్యేకరైళ్లు | special trains throuth duvvada | Sakshi
Sakshi News home page

దువ్వాడ మీదుగా ప్రత్యేకరైళ్లు

Published Sat, Aug 6 2016 5:52 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

special trains throuth duvvada

తాటిచెట్లపాలెం:  పుదుచ్చేరి వయా దువ్వాడ మీదుగా సంత్రగచ్చికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ఈ.కో. రైల్వే వాల్తేరు డివిజన్‌ తెలిపింది. రైళ్లవివరాలివే..
పుదుచ్చేరి– సంత్రగచ్చి– పుదుచ్చేరి వీక్లీ స్పెషల్‌ రైలు (06010/06009):
పుదుచ్చేరి నుంచి సంత్రగచ్చి వెళ్లే 06010 నెంబరు గల రైలు ఆగస్టు 6,27 సెప్టెంబర్‌  3,10 అక్టోబర్‌ 8,15,22,29 నవంబర్‌ 5,12 తేదీల్లో సాయంత్రం 07.15 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు 01.43 గంటలకు  దువ్వాడ చేరుకుని, సోమవారాల్లో తెల్లవారుజామున 04.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 06009 నెంబరుతో సంత్రగచ్చి నుంచి ఆగస్టు 8,29 సెప్టెంబర్‌ 5,12 అక్టోబర్‌ 10,17,24,31 నవంబర్‌ 7,14 తేదీల్లో  మధ్యాహ్నం 02.10 గంటలకు బయలుదేరి  ఆ మర్నాడు తెల్లవారు జామున 03.55 గంటలకు దువ్వాడ చేరుకుని అదే రోజు సాయంత్రం 08.20 గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది.
ఓ సెకండ్‌ ఎ.సి, మరో థర్డ్‌ ఎ.సి, ఏడు స్లీపర్‌క్లాస్‌లు, 6 జనరల్‌ సెకంyŠ lక్లాస్, రెండు సెకండ్‌ క్లాస్‌ కం లగేజ్‌ కోచ్‌ల కంపోజిషన్‌ ఉన్న ఈ రైళ్లు దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపూర్, ఖుర్గారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్‌ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement