శేషవాహనంపై శ్రీరంగనాథుడు
శేషవాహనంపై శ్రీరంగనాథుడు
Published Sat, Apr 8 2017 9:43 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM
తర్తూరు (జూపాడుబంగ్లా): తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం శేషవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవ విగ్రహానికి పన్నీటితో స్నానం చేయించి పట్టువస్త్రాలతో ముస్తాబుచేశారు. వేదమంత్రాల మధ్య స్వామి, అమ్మవార్లను మల్లెపూలతో అలంకరించి అనంతరం పల్లకిలో ఉంచి ఊరేగింపుగా శేషవాహనం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం భక్తుల జయజయ ధ్వానాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శేషవాహనోత్సవానికి విశిష్టత ఉంది. ఈ రోజు స్వామివారికి మల్లెలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటే తమకు సర్పగండం ఉందని భక్తుల నమ్మకం. దీంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మల్లెపూలలను సమర్పించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో భక్తులు సమర్పించి మల్లెలతో స్వామివారి, అమ్మవారి మూల విగ్రçహాలు నిండిపోయాయి. ఆదివారం హనుమద్వాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు వెంకటరెడ్డి, ఈఓ సుబ్రమణ్యంనాయుడు, చైర్మన్ రాయపురంగారెడ్డి తెలిపారు.
Advertisement