శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం మంగళవారం సమయానికి 870.30 అడుగులకు చేరుకుంది. జలాశయానికి ఎలాంటి ఇన్‌ఫ్లో లేదు. ఉపరితల ఆవర్తనం కారణంగా శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాల్లో 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 3వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 1,680 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 143.0616 టీఎంసీల నీరు నిల్వ ఉంది.