ఓ ఆటోడ్రైవర్‌ను అమానుషంగా చితకబాదిన ఎస్‌ఐ తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగిన సంఘటన అశ్వాపురంలో జరిగింది.
- పోలీసు స్టేషన్ ఎదుట గ్రామస్తుల ఆందోళన
అశ్వాపురం (ఖమ్మం జిల్లా) : ఓ ఆటోడ్రైవర్‌ను అమానుషంగా చితకబాదిన ఎస్‌ఐ తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగిన సంఘటన అశ్వాపురంలో జరిగింది. అశ్వాపురం ఎస్‌ఐ దుందుడుకుగా వ్యవహరించి గొల్లగూడెంకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ను చిన్న కారణానికి అమానుషంగా చితకబాదాడు. ఎస్‌ఐ తీరును నిరసిస్తూ మంగళవారం పోలీస్ స్టేషన్ ఎదుటు గ్రామస్తులతోపాటు కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసు అధికారులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.