ప్రశాంత నిలయంగా స్పెషల్‌ సబ్‌జైల్‌ | sub-jail peaseful | Sakshi
Sakshi News home page

ప్రశాంత నిలయంగా స్పెషల్‌ సబ్‌జైల్‌

Published Sat, Oct 1 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

ప్రశాంత నిలయంగా స్పెషల్‌ సబ్‌జైల్‌

ప్రశాంత నిలయంగా స్పెషల్‌ సబ్‌జైల్‌

కాకినాడ లీగల్‌æ:
కాకినాడలో ఒక స్పెషల్‌ సబ్‌జైల్‌ ఉంది. ఇక్కడ ఖైదీలకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆధునాతన వసతులు కల్పించారు. నేర స్వభావం నుంచి సమాజంలో గౌరవంగా బతికే విధంగా ఖైదీలలో మార్పు తీసుకొచ్చేందు జైలు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సబ్‌జైలు పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. లోపలకు వెళితే ఇదొక జైలులా కాక సంస్కరణ కేంద్రంగా తలపించేలా ఉంటుంది. విశాలమైన గదులతోపాటు ఫ్యానులు ఉంటాయి. ఓంశాంతివారితో ఉదయం శాంతిసందేశంతోపాటు యోగా చేయిస్తున్నారు. జైలు లోక్‌ అదాలత్‌ నిర్వహించి కేసులను పరిష్కరిస్తారు. న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి వివిధ అంశాలపై ఖైదీలకు అవగాహన కల్పిస్తున్నారు. మినరల్‌ వాటర్, రైస్‌ కుక్కర్లు, డైనింగ్‌ టేబుళ్లు, గార్డెన్, çషవర్‌బాత్‌ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఖైదీల కోసం వచ్చే బంధు, మిత్రులకు కూర్చోడానికి షెల్టర్, మంచినీరు ఏర్పాటు చేశారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ఎవరి పనులు వారు చకచక చేసుకుపోతారు. ఇటీవలే జైలు శాఖ జిల్లాలో స్పెషల్‌ సబ్‌జైల్‌కు అంబులెన్స్‌ సౌకర్యం కల్పించింది. అయితే అంబులెన్స్‌కు డ్రైవర్‌ను నియమించాల్సి ఉంది.
 
ఖైదీల మెనుల్లో మార్పులు
ఉదయం టిఫిన్, వారంలో రెండు రోజులు చపాతి, అందులో బంగాళదుంప కూర, మరో రెండు రోజులు గోదుమనూక, వరినూక ఉప్మా, రెండురోజులు పులిహోర, ఒక రోజు పొంగలి పెడుతున్నారు. నెలలో మొదటి ఆదివారం మధ్యాహ్నం మేక మాంసం, రెండు, మూడు, నాలుగు వారాలు కోడిమాంసం, మంగళవారం కోడిగుడ్డు ఇస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రెండేసి రోజులు కందిపప్పు, శనగపప్పు, పెసరప్పుతో పాటు ఆకు కూర పెడుతున్నారు. సాయంత్రం కాయకూరల భోజనం పెడుతున్నారు. 
 
సత్ప్రవర్తనకు కృషి
ఖైదీల ఆలోచనా విధానంలో మార్పు వచ్చేలా స్నేహభావంతో వ్యవహరిస్తున్నాం. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వారానికి రెండు రోజులు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలుగా ఫోన్‌ సౌకర్యం కల్పించాం. ఆశ్రమ వాతావరణం కల్పించి వారిలో సత్ప్రవర్తను తెచేందుకు కృషి చేస్తున్నాం.
– కె.చిన్నారావు, జిల్లా సబ్‌జైలు అధికారి
 
ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నాం
విధి నిర్వహణ, సేవాభావంతో నిరంతరం ఖైదీల సంక్షేమం కోసం పనిచేయడమే మా నిత్య విధి.అలాగే ఖైదీలకు పెట్టే భోజనం గురించి, ఖెదీల ఆరోగ్యం గురించి ప్రతి రోజు పర్యవేక్షిస్తాం. వారికి కావలసిన వసతులు కోసం నిరంతరం కృషి చేస్తున్నాం.
– బి.బ్రహ్మయ్య, జైలర్, స్పెషల్‌ సబ్‌జైలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement