అనంతపురం సప్తగిరి సర్కిల్:రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక పార్టీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ రామగిరి మండల కన్వీనర్ నాగరాజు అన్నారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై దాడికి కుట్ర పన్నారన్నారు. తనపై దాడి జరిగితే ఇందుకు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్‌దే బాధ్యతన్నారు. పేరూరు వద్ద సుజ్‌లా¯ŒS కంపెనీ వారు రైతుల వద్ద తీసుకున్న భూములకు నష్టపరిహారం చెల్లించకుండా అడ్డుపడుతున్నారన్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అధికార పార్టీ వారే తమ పొలాల్లోని చెట్లను నరికేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. పోలీసులు కూడా వారికి తొత్తు లుగా వ్యవహరిస్తున్నారన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి కేశవనారాయణ మాట్లాడుతూ హంద్రీ నీవా కాలువ పనులను దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 90 శా తం పూర్తి చేయగా, టీడీపీ నాయకులు 2 శాతం పనులను చేసి అంతా తామే చేశామని ప్రజలను నమ్మించే ప్రయ త్నం చేస్తున్నారన్నారు. వచ్చిన నీటిని వినియోగించడంలోను అధికారులు, అధికార పార్టీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చిన్న పెద్దన్న మాట్లాడుతూ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎస్సీలకు పంచిన భూములను తిరిగి లాగేసుకుంటున్నారన్నారు.