హన్మకొండ మండలం తిమ్మాపురంలోని ఝాన్సీనగర్‌కు చెందిన అక్షిత(5) అనే చిన్నారిని ఇంటి వద్ద గురువారం రాత్రి పాముకాటేసింది.
హన్మకొండ(వరంగల్ జిల్లా): హన్మకొండ మండలం తిమ్మాపురంలోని ఝాన్సీనగర్‌కు చెందిన అక్షిత(5) అనే చిన్నారిని ఇంటి వద్ద గురువారం రాత్రి పాముకాటేసింది. దీంతో చిన్నారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అక్షిత శుక్రవారం ఉదయం చనిపోయింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.