ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: హరీశ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొలిసారిగా ఈ నెల 7న రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లన్ని పూర్తిచేశామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మిషన్ భగీరథను ప్రధాని చేతులమీదుగా ప్రారంభం చేయిస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1200 మెగావాట్ల విద్యుత్ ఉతప్పత్తి ప్లాంట్‌ను మోదీ జాతికి అంకితం చేస్తారని తెలిపారు.రరామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని ప్రధాని ముఖ్యమంత్రి కే సీఆర్‌తో కలిసి పునః ప్రారంభిస్తారిన అన్నారు. కొత్తపల్లి-మనోహరబాద్ రైల్వేలైన్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారన్నారు. ప్రధాని సభా ప్రాంగణంలో మూడు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని.. ప్రధాని వేదిక పై 18 మంది అతిథులు కూర్చునేలా ఏర్పాట్లు చేశామన్నారు.