కోడిపందేలు... గుండెపోటుతో వ్యక్తి మృతి | The fear of a heart attack after a man killed | Sakshi
Sakshi News home page

కోడిపందేలు... గుండెపోటుతో వ్యక్తి మృతి

Published Fri, Apr 8 2016 9:57 PM | Last Updated on Sun, Sep 2 2018 3:57 PM

కోడిపందేలు... గుండెపోటుతో వ్యక్తి మృతి - Sakshi

కోడిపందేలు... గుండెపోటుతో వ్యక్తి మృతి

భయంతో గుండెపోటుకు గురై వ్యక్తి మృతి

గోవిందరావుపేట(వరంగల్): కోడిపందాల శిబిరంపై పోలీసులు దాడిచేయగా పారిపోయే క్రమంలో ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందాడు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం రాంనగర్ శివారులోని మామిడితోటలో కొంతమంది ఉగాది పండుగ సందర్భంగా శుక్రవారం కోడిపందాలు వేస్తున్నారు. గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన కొమ్మరాజు రాంబాబు (45) అక్కడకు చూసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పోలీసులకు ఈ విషయమై సమాచారం అందింది.

 

దీంతో వారు అక్కడకు చేరుకోగానే జనం పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారి వెంట పడ్డారు. ఒకవైపు వెళ్లిన రాంబాబు చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు వచ్చి కదలకుండా ఉండిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఎస్సై యాసిన్ స్థానికులకు సమాచారం అందించారు. పోలీసులు రాంబాబును చెట్టుపై నుంచి కిందికి దింపి గోవిందరావుపేటలోని ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement