అనంతపురం జిల్లా పెనుకొండ మండలం దొడ్డికుంట గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరు తాలూకా గొల్లపల్లికి చెందిన కుటుంబం అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కొండాపురం గ్రామానికి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
వేగంగా వెళుతున్న కారు పక్కనున్న బ్రిడ్జిని ఢీకొని బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న చంద్రారెడ్డి, హనుమంతరెడ్డి, రాజమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెనుకొండ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్సనిమిత్తం 108లో తరలించారు.