Rajamma
-
కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు
వెల్గటూర్(ధర్మపురి): కొడుకు వేధింపులకు విసిగి వేసారిన ఓ దంపతులు అతడిని కొట్టి చంపారు. జగి త్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకార.. రాంనూర్‌కు చెందిన కొదురుపాక భూమయ్య–రాజమ్మ దంపతులు. వీరికి మహేశ్ (35)అనే ఒక కుమారుడితోపాటు ఓ కుమార్తె ఉన్నారు. భూమయ్య సింగరేణి సంస్థలో కార్మికుడిగా పనిచేస్తూ గోదావరిఖనిలో నివాసం ఉండేవాడు. ఉద్యోగ విరమణ చేశాక స్వగ్రామం రాంనూర్ వచ్చి స్థిరపడ్డాడు. ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులు, భార్యతో మహేశ్ గొడవపడుతున్నాడు. ఈనెల 20న తనకు రూ.200 కావాలని తండ్రి భూమయ్యను మహేశ్ అడిగాడు. అయితే భూమయ్య ఇవ్వకపోవడంతో గొడవకు దారితీసింది. గొడవ పెద్దది కా వడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, కౌలు దారు శేఖర్‌తో కలసి మహేశ్‌ను తీవ్రంగా కొట్టారు. ఈ దాడి లో అతని కాళ్లు, చేతులు విరిగి తీవ్రరక్తస్రావమైంది. తొ లుత జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మహేశ్ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. -
రాజమ్మను కలిసిన రాహుల్ గాంధీ
సాక్షి, తిరువనంతపురం : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ’ఆమె’కు అనుకోని విధంగా ఆశ్చర్యంలో ముంచెత్తారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం రిటైర్డ్ నర్సు రాజమ్మ వవాతిల్ను కలుసుకుని, ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు. 48 ఏళ్ల క్రితం తన చేతులతో ఎత్తుకున్న ఓ బిడ్డ ఇప్పుడు తనను చూసేందుకు రావడంతో రాజమ్మ ఆనందంలో మునిగి తేలారు. ఇంతకీ ఈ రాజమ్మ ఎవరనుకుంటున్నారా?. 1970 జూన్ 19 రాహుల్ గాంధీ పుట్టినప్పుడు లేబర్ రూమ్‌లో రాజమ్మ నర్సుగా ఉన్నారు. రాహుల్ జన్మించినప్పుడు ఆమెకు 23 ఏళ్లు. నర్సింగ్‌లో డిగ్రీ చదివిన తర్వాత ఆమె హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో విధులు నిర్వహించారు. రిటైర్మెంట్ అనంతరం ప్రస్తుతం రాజమ్మ భర్తలో కలిసి వయనాడ్‌లో నివసిస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ నుంచి ఎంపీగా రాహుల్ పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ ఢిల్లీ పుట్టాడనటానికి తానే సాక్ష్యమంటూ రాజమ్మ మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. -
ఆలయ కోనేరులో పడి ముగ్గురు దుర్మరణం
నిజామాబాద్ జిల్లా యెడపల్లి మండలం జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద అపశృతి చోటు చేసుకుంది. స్వామి దర్శనం కోసం వచ్చిన ముగ్గురు కోనేరులో పడి మృతి చెందారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ పట్టణానికి చెందిన ఓ కుటుంబం ఆదివారం సాయంత్రం ఆలయానికి వచ్చింది. స్వామి దర్శనం అనంతరం రాజమ్మ (50) తన ఇద్దరు మనవళ్లు నవతేజ (10), అరుణ్(10)తో కలసి కోనేరు దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లింది. ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో ఒకరు కోనేరులో దిగి మునిగిపోతుండగా మరో బాలుడు బయటకు లాగే ప్రయత్నం చేశాడు. అతడు కూడా నీటిలో పడిపోవడంతో వారిని రక్షించేందుకు వెళ్లిన రాజమ్మ కూడా కోనేరులో మునిగి ప్రాణాలు కోల్పోయింది. రాత్రి 9 గంటల తర్వాత మృతదేహాలను వెలికి తీయించిన పోలీసులు పోస్ట్‌మార్టం కోసం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. -
పెనుకొండ వద్ద కారు బోల్తా - ముగ్గురి దుర్మరణం
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం దొడ్డికుంట గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరు తాలూకా గొల్లపల్లికి చెందిన కుటుంబం అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కొండాపురం గ్రామానికి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు పక్కనున్న బ్రిడ్జిని ఢీకొని బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న చంద్రారెడ్డి, హనుమంతరెడ్డి, రాజమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెనుకొండ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్సనిమిత్తం 108లో తరలించారు. -
తాగుబోతు తండ్రిని చంపిన కొడుకు
-
తాగుబోతు తండ్రిని చంపిన కొడుకు
మద్యం మత్తులో వేధిస్తున్న తండ్రిని ఓ తనయుడు ఇనుపరాడ్‌తో మోది హత్య చేశాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని గన్నవారిపల్లి కాలనీలో ఈ ఘటన జరిగింది. ఓబులేసు (60) మద్యానికి బానిసై ఐదేళ్ల క్రితం తన పెద్ద కుమారుడు రాజును హత్య చేశాడు. భార్య రాజమ్మ, చిన్న కుమారుడు సురేష్ (16)ను కూడా తరచూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి రాజమ్మతో గొడవపడ్డాడు. తల్లిని కూడా చంపేస్తాడేమోనన్న ఆందోళనతో సురేష్ రాడ్ తీసుకుని తన తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో ఓబులేసు ప్రాణాలు విడిచాడు. తానే తండ్రిని చంపానని ఒప్పుకుని సురేష్ పోలీసులకు లొంగిపోయాడు. సురేష్ ఐటీఐ చదువుతున్నాడు. -
రాజమ్మ అంత్యక్రియలు పూర్తి
పులివెందుల: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మేనత్త రాజమ్మ అంత్యక్రియలు వైఎస్సార్ జిల్లా పులివెందులలో సోమవారం ముగిశాయి. ఆమె ఆదివారం ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. వైఎస్ కుటుంబసభ్యులకు చెందిన శ్మశానవాటికలో ఆమెను ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతానికి దంపతుల మృతి
-
విద్యుదాఘాతానికి దంపతుల మృతి
వరంగల్ జిల్లా: ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తెగిపడి విద్యుదాఘూతానికి గురై దంపతులు మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో జరిగింది. వివరాలు.. కరీమాబాద్‌కు చెందిన అంకాటి రమేష్ (45), రాజమ్మ (40) దంపతులు విద్యుదాఘూతానికి బలయ్యారు. ఆదివారం ఉదయం గాలులతో కురిసిన అకాల వర్షాలకు తన ఇంటిపై ఉన్న కరెంట్ తీగలు తెగి దుస్తులు ఆరేసే తీగపై పడ్డాయి. అయితే ఈ విషయం తెలియని దంపతులు దుస్తులు ఆరేస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (కరీమాబాద్) -
నెలరోజులుగా ఇందిరమ్మలబ్ధిదారులకు శూన్యహస్తం
ఫొటోలోని మహిళ పేరు రాజమ్మ. రాజుపాళెం మండలం టంగుటూరు ఎస్సీ కాలనీ వాసి. ఈమెకు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైంది. ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం ఇచ్చే డబ్బు సరిపోకపోవడంతోపాటు బిల్లులు సక్రమంగా రాకపోవడంతో ఇంటి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. దీనికి తోడు మరో అడ్డంకి ఏర్పడింది. సిమెంటు ఇవ్వం.. డబ్బులిస్తాం.. మీరే తెచ్చుకోండని చెబుతున్నారు. అదనంగా డబ్బులు చెల్లించి ఎక్కడ సిమెంటు తెచ్చుకోవాలని రాజమ్మ ఆవేదన వ్యక్తంచేస్తోంది. మొత్తానికి ఆమె ఇంటి నిర్మాణం ఆగిపోయింది. సాక్షి, కడప/రాజుపాలెం, న్యూస్‌లైన్ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న మొత్తం సరిపోక అల్లాడుతున్నారు. కూలీలు, ఇసుక, ఇనుప కడ్డీలు, ఇటుకల ధరలు అమాంతం పెరగడంతో కొన్నిచోట్ల ఇందిరమ్మ గృహాలు ఆగిపోయాయి. దీనికితోడు ‘మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు’ ఇందిరమ్మ గృహాలకు ఇచ్చే సిమెంటును లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. బస్తాకు రూ.184 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో బస్తా ధర రూ.284 పలుకుతోంది. బస్తాకు అదనంగా రూ.100 చెల్లించాల్సివస్తోంది. ఒక్కో లబ్ధిదారునికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 60బస్తాల సిమెంటు ఇస్తుంది. అంటే రూ.6వేలు వీరికి అదనపు భారంగా పడుతోంది. ముందే అంతంతమాత్రంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సిమెంటు కొరతతో మరింత నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాగుతోందిలా.. : జిల్లావ్యాప్తంగా అన్ని దశల్లో ప్రభుత్వం ఇప్పటివరకు 2,47,007 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 7,800 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమేకాలేదు. 46వేల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిపై ప్రధానంగా సిమెంటు ప్రభావం చూపుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఓసీలకు 80వేలు, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో 20వేలు ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఓసీలకు రూ.70వేలు, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రూ.25వేలు ఇస్తారు. అయితే ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఇంటి నిర్మాణానికి సరిపోవడంలేదు. ఇనుము, ఇసుక, కూలీల ధరలతోపాటు మిగతావి అమాంతం పెరిగాయి. ఓ ఇంటి నిర్మాణానికి అదనంగా 70వేల నుంచి రూ. లక్ష ఖర్చవుతోంది. దీనికితోడు రూ.6వేలు అదనంగా సిమెంట్ భారం పడుతుండటంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిమెంటు సరఫరా చేయాలని కోరాం : జిల్లాకు 11,400 మెట్రిక్ టన్నుల సిమెంటును సరఫరా చేయాలని ఇప్పటికే సిమెంటు ఫ్యాక్టరీలను కోరాం. వారు సిమెంటును సరఫరా చేయడం లేదు. ధరల్లో వ్యత్యాసం ఉండటమే ప్రధాన కారణం. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సిమెంటు బస్తాల బదులు నగదును చెల్లిస్తున్నాం. త్వరలో సిమెంటు అందించేలా చర్యలు తీసుకుంటాం. -సాయినాథ్, హౌసింగ్ పీడీ.