
విద్యుదాఘాతానికి దంపతుల మృతి
వరంగల్ జిల్లా: ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తెగిపడి విద్యుదాఘూతానికి గురై దంపతులు మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో జరిగింది. వివరాలు.. కరీమాబాద్‌కు చెందిన అంకాటి రమేష్ (45), రాజమ్మ (40) దంపతులు విద్యుదాఘూతానికి బలయ్యారు. ఆదివారం ఉదయం గాలులతో కురిసిన అకాల వర్షాలకు తన ఇంటిపై ఉన్న కరెంట్ తీగలు తెగి దుస్తులు ఆరేసే తీగపై పడ్డాయి. అయితే ఈ విషయం తెలియని దంపతులు దుస్తులు ఆరేస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(కరీమాబాద్)