జిల్లాలోని వేర్వేరు ప్రాంతా ల్లో ముగ్గురు బుధవారం ఆత్మహత్య చేసుకు న్నారు.
మడకశిర రూరల్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతా ల్లో ముగ్గురు బుధవారం ఆత్మహత్య చేసుకు న్నారు. మడకశిర వడ్రపాళ్యం సమీపలోని మైనారిటీ ఇందిరమ్మ కాలనీలోని ఇంటిలో, పెనుకొండ రోడ్డులో నివాసం ఉంటున్న హం సమ్మ భర్త ఓబుళరాజు(25) తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సబ్‌స్టేçÙన్ వద్ద పనిచేస్తున్న కూలీ లు బుధవారం కాలనీ వద్దకు మలవిసర్జనకు వెళ్లిన సమయంలో దుర్వాసన రావడంతో గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని 10రోజులు కావడంతో దుర్వాసన వస్తోంది. అక్కడే మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయి. భార్యభర్తల మధ్య గొడవ ఇతని ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చునని తెలుస్తోంది. పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బేగార్లపల్లిలో బుధవారం ఉదయం యశోదమ్మ భర్త రంగస్వామి(40) పాత ఇంటి లో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు రంగస్వామి తరుచూ మద్యం సేవించేవాడు. ఇలా అయితే పిల్లలను ఎలా చదివించాలని భార్య యశోదమ్మ మందలించడంతో బార్య భర్తల మధ్య మాటా మాట పెరిగి, ఘర్షణ పడ్డారని స్థానికులు తెలిపారు. భార్య ఇంకోఇంటి వద్దకు వెళ్ళగానే జీవితంపై విరక్తి చెంది ఇంటిలో రంగస్వామి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం మడకశిర ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
అనంతలో యువకుడు..
అనంతపురం సెంట్రల్ : అనంతపురంలోని హమాలీ కాలనీకి చెందిన రవికుమార్ కుమారుడు బాబు(21) బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ రాఘవన్, ఎస్‌ఐ వెంకటరమణ తెలిపారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలోఉరేసుకుని మృతి చెందినట్లు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సర్వజనాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు.
చేనేపల్లిలో ఆత్మహత్యాయత్నం
చిలమత్తూరు : మండలంలోని చేనేపల్లిలో కుటుంబ కలహాలతో హరికృష్ణ భార్య క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. బంధువులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హిందూపురం ఆస్పత్రికి తరలించారు. కాగా స్థానిక పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యాదు అందలేదు.