తిరుమల : అక్టోబర్ 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27వ తేదీన తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే అక్టోబర్ 2వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తున్నట్లు వివరించారు. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు వివరించారు.