తిరుపతి : తిరుపతిని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం తిరుపతిలో ఫుడ్ ఫెస్టివల్ను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... పేదవాడికి పప్పన్నం పెట్టాలన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం చంద్రన్న కానుక ప్రవేశపెట్టినట్లు చెప్పారు. టూరిజం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు అధికమవుతాయన్నారు.
తిరుపతి పరిసర ప్రాంతాల్లోని చెరువుల అభివృద్ధిని టీటీడీకి అప్పగించామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీలోని హోటల్స్ రంగం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. హస్తకళల అభివృద్ధికి రూ.17 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.