అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలి | To be dissolved fake diputations | Sakshi
Sakshi News home page

అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలి

Published Sun, Jul 24 2016 8:51 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

To be dissolved fake diputations

నల్లగొండ టూటౌన్‌ : ఉపాధ్యాయులను సంబంధించిన అక్రమ డిప్యూటేషన్లు వెంటనే రద్దు చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌.రాములు డిమాండ్‌ చేశారు. ఆదివారం యూటీఎఫ్‌ భవన్‌లో జరిగిన ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనం తీసుకున్న చోటే పనిచేయాల్సి ఉన్నా ఈ మధ్య కాలంలో విద్యార్థుల అవసరాల దృష్ట్యా కాకుండా ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఇతర మండలాలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారని తెలిపారు. సూర్యాపేట నుంచి భువనగిరికి, తుంగతుర్తికి అక్రమంగా సర్దుబాటు చేశారని విమర్శించారు. ప్రజా ప్రతినిధుల వద్ద ముగ్గురు ఉపాధ్యాయులు పీఏలుగా పనిచేస్తున్నారని వెంటనే వారి డిప్యూటేషన్‌ రద్దు చేయాలన్నారు. సమావేశంలో యూటీఎప్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, పేరుమాళ్ల వెంకటేశం, యాదయ్య, అరుణ, రామలింగయ్య, సైదులు, సయ్యద్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement