విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించాలి
-
డీఈఓ పి.రాజీవ్
-
అక్టోబర్‌లో జిల్లాస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్
విద్యారణ్యపురి: విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ చక్కటి వేదిక అని డీఈఓ పి.రాజీవ్ అన్నారు. మంగళవారం హన్మకొండలోని న్యూసైన్స్ పీజీ కళాశాలలో 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లోని ప్రధాన అంశమైన ‘సుస్థిర అభివృద్ధికి విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం’పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు సైన్స్ అంశాలపై ఆసక్తిని పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. అనంతరం నిజాం కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చాంద్‌పాషా, ఎన్‌సీఎస్‌సీ రాష్ట్ర ఫీల్డ్ ఆఫీసర్ ఎం.సాంబశివారెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌ను ఈఏడాది నవంబర్ 10,11 తేదీల్లో మెదక్ జిల్లా నందిగ్రామ్‌లో నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. అందువల్ల జిల్లా స్థాయిలో పోటీలను అక్టోబర్‌లో నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి సీహెచ్.కేశవరావు, మహబూబాబాద్ డిప్యూటీ డీఈఓ తోట రవీందర్, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా కోఆర్డినేటర్ కె.రాంగోపాల్‌రెడ్డి,అకాడమిక్ కోఆర్డినేటర్ వి.గురునాథరావు, రిసోర్స్‌పర్సన్‌లు పాల్గొన్నారు.