మా మండలాన్నిహన్మకొండలోనే ఉంచాలి | To put in our zone hanmakonda | Sakshi
Sakshi News home page

మా మండలాన్నిహన్మకొండలోనే ఉంచాలి

Published Sat, Sep 10 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

మా మండలాన్నిహన్మకొండలోనే ఉంచాలి

మా మండలాన్నిహన్మకొండలోనే ఉంచాలి

హన్మకొండ అర్బన్‌ : ప్రస్తుతం వరంగల్‌ జిల్లాలో ఉన్న హసన్‌పర్తి మండలాన్ని కొత్తగా ఏర్పడనున్న హన్మకొండ జిల్లాలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని పలు గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఆయా గ్రామాల నుంచి హసన్‌పర్తి మండల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సుల్లో కలెక్టరేట్‌కు వచ్చిన సుమారు 300 మంది విడివిడిగా బారులు తీరి కలెక్టరేట్‌లో వినతిపత్రాలు అందజేశారు. హసన్‌పర్తి మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న వరంగల్‌ జిల్లాలో కలపనున్నట్లు ఇటీవల ప్రకటన వచ్చిన నేపథ్యంలో వారు ఇలా వినతిపత్రాలు ఇచ్చారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ ఎదుట కొద్దిసేపు రాస్తారోకో చేశారు. ఆందోళనలో పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు పుట్ట రవి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌తో పాటు శీలం సారయ్య, గురుమూర్తి, శివకుమార్, ఆరెపల్లి పవన్, జన్ను రవీందర్, బోడ యుగేందర్, పెట్ట బిక్షపతి, యాదగిరి, వల్లాల గణేష్, బొక్క కుమార్, రమణ, రమేష్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement