బహుజన బతుకమ్మను కాపాడుకుందాం | To save the bahujana bathukamma | Sakshi
Sakshi News home page

బహుజన బతుకమ్మను కాపాడుకుందాం

Published Sun, Oct 9 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

బహుజన బతుకమ్మను కాపాడుకుందాం

బహుజన బతుకమ్మను కాపాడుకుందాం

యాదగిరిగుట్ట : రాష్ట్రంలో పెత్తందార్ల పాలనకు స్వస్తి పలికి బహుజన బతుకమ్మను కాపాడుకోవాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు.

యాదగిరిగుట్ట : రాష్ట్రంలో పెత్తందార్ల పాలనకు స్వస్తి పలికి బహుజన బతుకమ్మను కాపాడుకోవాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క  పిలుపునిచ్చారు. బహుజన బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆదివారం  మండలంలోని చొల్లేరులో చివరి రోజు ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే తీరోక్క పూల జాతర బతుకమ్మ అని అన్నారు. వలసలు ఆగి పోవాలంటే.. కరువు వెనక్కి వస్తేనే బతుకమ్మను కాపాడుకున్నట్లని తెలిపారు. శ్రమజీవుల నోటిలో నిత్యం వెలువడే ఉయ్యాల పాటలు ఉండాలంటే బహుళ జాతి పరిశ్రమలను తరిమికొట్టి బతుకమ్మ ప్రత్యేకతను ప్రజలకు లె లియపరచాలని  కోరారు. బతుకమ్మ సాక్షిగా ప్రతి మహిళా అభ్యున్నతి సాధించాలన్నారు. ఏడాది ఒక్క సారి మహిళలంతా ఒకే చోట చేరి పాటలు పాడుతూ, ప్రకృతి దేవతను పూజించడం గొప్ప సంస్కృతి తెలంగాణ మహిళలకే దక్కిందన్నారు. ఈ వేడుకల్లో పీస్‌ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ కొక్కలకొండ నిమ్మయ్య ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement